డ్రగ్స్‌కు పబ్‌లు కేరాఫ్ అడ్రస్

డ్రగ్స్‌కు పబ్‌లు కేరాఫ్ అడ్రస్

డ్రగ్స్ అమ్మకాలకు పబ్బులు కేరాఫ్ అడ్రస్ గామరాయన్నారు  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  డ్రగ్స్ నిర్మూలన లో భాగంగా టెస్టుకు శాంపిల్స్ ఇవ్వాలని.. కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరారు రేవంత్. ఈ సందర్భంగా కేటీఆర్ గన్ పార్క్ వద్దకు రావాలంటూ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. తాను వైట్ ఛాలెంజ్ విసరకముందే..కేటీఆర్ తన బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు టెస్టుకు ఇస్తానన్నారని చెప్పారు. యువతకు ఆదర్శంగా ఉండాలనే వైట్ ఛాలెంజ్ చేశానన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరించకుండా తిట్లదండకం అందుకున్నారన్నారు. టెస్టుకు రమ్మంటే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్నారు.

కేటీఆర్ ఎమ్మెల్యే కాకముందే తాను ఎమ్మెల్సీ గా గెలిచానన్నారు. దేశంలోనే పెద్ద పార్లమెంట్ స్థానానికి ఎంపీనని.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడినన్నారు. రాజకీయ పరంగా కేటీఆర్ తన వెంట్రుకతో సమానమని..కానీ తాను అలా అనని చెప్పారు. ఎందుకంటే కేటీఆర్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారన్నారు. డ్రగ్స్ అమ్మకాలకు పబ్బులు కేరాఫ్ అడ్రస్ గామరాయన్నారు . పబ్బుల యజమానులు డ్రగ్స్ అందుబాటులోకి తెస్తున్నారన్నారు.  డ్రగ్స్ ఇష్యూపై విచారణ జరపాలని కోర్టులో పిటిషన్ వేశానని..కోర్టు అన్ని శాఖలకు నోటీసులిచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తుసంస్థలకు సహకరించలేదన్నారు. విచారణ మధ్యలో ఉండగానే అకున్ సబర్వాల్ ను తప్పించారన్నారు.  హైదరబాద్ సిటీలో డ్రగ్స్ విస్తరించిందన్నారు.