రేవంత్ తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసేది వీరే

రేవంత్ తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసేది వీరే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు 12 మంది మంత్రులు కూడా అదే వేదికపై ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 4 నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు హైదరాబాద్ చేరుకున్నారు. వీరిని రేవంత్ రెడ్డితోపాటు ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు.

ఇక రేవంత్ రెడ్డితోపాటు మంత్రులుగా 12 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణం చేస్తుండగా.. మంత్రులుగా శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. 

నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల, పొంగులేటికి అవకాశం దక్కింది. ఇక వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ, కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు..