
రాష్ట్ర సెక్రటేరియట్ ను కూల్చవందంటూ పీఎస్ కు మెమోరెండమ్ ఇచ్చారు మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. సీఎస్ జోషీ అందుబాటులో లేకపోవడంతో పీఎస్ ను కలిశారు. మీడియాతో మాట్లాడిన ఆయన… సీఎం కేసీఆర్ ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న సెక్రటేరియట్ వాస్తుతో.. గత సీఎంల కొడుకులు సీఎం లు కాలేదని కేసీఆర్ నమ్ముతున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో.. ఎన్టీఆర్ కొడుకులు సీఎంలు కాకుండా అల్లుడు చంద్రబాబు సీఎం అయ్యాడని.. అదేవిధంగా.. కేసీఆర్ అల్లుడు.. హరీష్ రావు ఎక్కడ సీఎం అవుతాడోనని భయపడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసమే సెక్రటేరియట్ ను కూల్చి కొత్తది కట్టడానికి చూస్తున్నట్లు రేవంత్ చెప్పారు.
ఎవరో పండితుడు చెప్పాడని కోట్ల రూపాయలను వృదా చేయడం మంది కాదని అన్నారు రేవంత్ రెడ్డి. వాస్తును నమ్మడం తప్పుకాదని కేసీఆర్ లా పిచ్చి మాత్రం ఉండకూడదని చెప్పారు రేవంత్. ఆరోగ్యశ్రీ కి నిధులు అందక పేషెంట్స్ చనిపోతుంటే సీఎం పట్టించుకోవడంలేదని అన్నారు. గురుకులాలకు సొంత భవనాలు లేవుకాని 100 కోట్ల రూపాయలు కర్చుపెట్టి సెక్రటేరియట్ ను ఎలా కడతారని ప్రశ్నించారు.