
డిసెంబర్ 9వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం కామారెడ్డిలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడగొడుతున్నామని అన్నారు.
రేవంత్ రెడ్డి కామెంట్స్:
- కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడగొడుతున్నం
- శ్రీకాంతా చారి ప్రాణ త్యాగం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు.
- శ్రీకాంతా చారి త్యాగానికి, ఎన్నికల తేదీకి ఒక లింక్ ఉంది.
- డిసెంబర్ 3న శ్రీకాంతా చారి తన తుదిశ్వాస విడిచాడు.
- డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
- కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని సోనియా గాంధీ విజ్ఒప్తికి తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలిపారు.
- నాలుగు కోట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా.
- కేసీఆర్ లాగా కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా ఉండరు.
- బీఆర్ఎస్ నేతలది మేకపోతు గాంభీర్యం.
- కాంగ్రెస్ నేతలు ఈరోజు నుంచే సంబురాలు చేసుకోవచ్చు.
- ప్రభుత్వ నిర్ణయాల్లో విపక్షాల అభిప్రాయాలకు విలువ ఉంటుంది.
- ప్రజలంటే బీఆర్ఎస్ నాయకులకు చిన్న చూపు.
- ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్ అని కేటీఆర్ అంటున్నారు.
- ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణ చెబుతారా?.
- ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్ వ్యవషహరించారు.
- కేసీఆర్ కుటుంబం ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
- అదిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.
- కాంగ్రెస్ పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.