కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరపడ్డయ్

కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరపడ్డయ్

తెలంగాణ వచ్చాక ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలుచేసిండన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో  ఉన్న ప్రాజెక్టులన్నీ.. 60 ఏళ్ళల్లో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు అధికారంలో ఉండి.. 69 వేల కోట్లే అప్పు చేస్తే.. కేసీఆర్ ఈ ఏడేళ్లల్లోనే 5 లక్షల కోట్ల అప్పు చేసిండన్నారు. శ్రీలంకలానే తెలంగాణ లోటు బడ్జెట్ లో ఉందన్నారు. శ్రీలంక ప్రజలు తరిమికొట్టినట్లే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాజపక్సే కుటుంబం దోచుకున్నట్లే కేసీఆర్ కుటుంబం ఇక్కడ దోచుకుంటుందన్నారు.  ఈ  నాలుగేళ్లలో ఏళ్ళల్లో 74 వేల మంది రైతులు చనిపోయినట్లు వారికీ రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు  సీఎం  కేసీఆర్ బర్త్ డే సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి  యాడ్ ఇచ్చుకున్నారన్నారు.

భూమిలేని పేదలకు అసైన్డ్ ల్యాండ్స్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు రేవంత్. భూముల్లో పంటలు బాగా పండాలని  సాగు నీరు అందించిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో దేశంలో డ్యామ్ లు, ప్రాజెక్టులు కాల్వలు నిర్మించిందన్నారు. భూమికి ఉన్న డీఎన్ఏను బట్టి ఏ పంట వేయాలో నిర్దారించవచ్చన్నారు. ప్రకృతిని, కాలాలను బట్టి ఎలాంటి పంటలు వేసుకోవాలో రాష్ట్ర సర్కార్ చెప్పాలన్నారు. రైతు శ్రమ దోపిడీకి గురవుతుందని భావించి  కాంగ్రెస్ కనీస మద్దతు ధరను తీసుకొచ్చిందన్నారు. ఈ పాలసీలు తీసుకొచ్చినం కాబట్టే.. రైతు దోపిడీకి గురికాకుండా ఉంటున్నాడన్నారు. కానీ గోడౌన్ లల్లో నిల్వలు దాచి వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడ్డానికి ఎఫ్ సీఐని ఏర్పాటు చేసింది కాంగ్రెస్సేనన్నారు రేవంత్.

మరిన్ని వార్తల కోసం

రాజీవ్ హత్య కేసు నిందితుడిని విడుదల చేయండి

ఎండలో కూర్చోబెట్టి విద్యార్థులకు పాఠాలు