ఆర్టీసీ ప్రైవేటీకరణ టీఆర్ఎస్ మేనిఫేస్టోలో ఉందా?: రేవంత్

ఆర్టీసీ ప్రైవేటీకరణ టీఆర్ఎస్ మేనిఫేస్టోలో ఉందా?: రేవంత్

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. సకల జనుల సమ్మెకు సమైక్యపాలకులు అనుమతిస్తే..ఇపుడు సభ పెట్టుకుంటామంటే కేసీఆర్ అనుమితవ్వడం లేదన్నారు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల వారు దోపిడికి గురయ్యారని అన్నారు. సరూర్ నగర్ లో సకల జనభేరిలో మాట్లాడిన రేవంత్..ఎర్రబెల్లి అనే ఊసరవెళ్లి ఆర్టీసీ విలీనం తమ అజెండాలో ఉందా అని అన్నారు..ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తామని మీ మేనిఫేస్టోలో ఉందా ? అని ప్రశ్నించారు రేవంత్.  20 శాతం మెఘా కృష్ణారెడ్డికి కట్టబెడతామని మీ మేనిఫెస్టోలో ఉందా? అని అన్నారు. తప్పుడు నివేదికలో ఇవాళ కోర్టును కూడా పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.

ఆర్టీసీ నష్టాల్లో లేదని..నష్టాల్లోకి నెట్టివేయబడిందన్నారు రేవంత్. విమానంలో పోసే పెట్రోల్ కు ఒక శాతం వ్యాట్ వసూలు చేస్తున్న కేసీఆర్..ఇవాల పేదోడు తిరిగే ఎర్రబస్సుకు 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. విభజనం చట్టం ప్రకారం ఆర్టీసీ ఆస్తులు,అప్పులు పంపకం ఇంకా జరగలేదంటున్నారు కాబట్టి ఏపీలో తీసుకున్న విలీన నిర్ణయం తెలంగాణలో కూడా వర్తిస్తుందన్నారు రేవంత్.