
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో అవాస్తవమన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ ను సీపీఐ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. మినీ ఇండియా అయిన మల్కాజ్ గిరి నుంచి తనను ప్రజలు గెలిపించారని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తానని అన్నారు రేవంత్.