న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో జరగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’లో తెలంగాణ ఏఐ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లో ఏఐ అభివృద్ధికి చేస్తున్న కృషి, ప్రభుత్వ ప్రోత్సాహం, అంతర్జాతీయ కంపెనీలకు పెట్టుబడుల అంశాలపై మాట్లాడనున్నారు.
ఈ సందర్భంగా స్వీడన్ వ్యాపార ప్రతినిధుల బృందం, ఇతర దేశాల ప్రతినిధులతో శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భేటీ కానున్నారు. అనంతరం భారత మండపం వెస్ట్ వింగ్‌లో జరిగే కార్యక్రమంలో మంత్రి ప్రసంగించనున్నారు.
