
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవపంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లా, అలుగునూరులో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన కొనియాడారు. ప్రపంచంలో భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను కూడా బలిచ్చారని ఆయన అన్నారు.
‘యువత రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకోని ముందుకెళ్లాలి. దళిత, బడుగు, బహుజన, మైనార్టీ వర్గాల అభ్యున్నతి జరగాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యం. కంప్యూటర్ రంగంలో ప్రస్తుతం భారత దేశం అగ్రగామిగా ఉందంటే దానికి రాజీవ్ కృషే కారణం. వ్యవసాయం, ఐటీ రంగంపై అత్యధిక దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ కట్టింది కాంగ్రెస్ కాదా? కాళేశ్వరం నుంచి 2 టీఎంసీలు ఎత్తిపోశామంటూ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు వానలతో నిండితే ఆ ఘనత తనదేనని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. కృష్ణా, గోదావరిని దివి నుంచి భువికి తెచ్చింది తానేనన్నంతగా కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ స్ఫూర్తితో పనిచేయాలి. ఎవరూ ఆందోళన చెందొద్దు. తొందర్లోనే మనకూ మంచి రోజులు వస్తాయి. ఎవడెవడు ఎగెరిగిరి దునకుతున్నడో లెక్కలు రాసి పెట్టండి. మనకూ అధికారం వస్తుంది. మిత్తితో సహా లెక్క చెల్లిద్దాం. ఎండకాలం తర్వాత వానకాలం వచ్చినట్లే.. మనకూ మంచి రోజులు వస్తాయి.
కాంగ్రెస్ కార్యకర్తలను ఆదుకుంటాం. పార్టీకి అండగా ఉన్నవాళ్ల సేవలను గుర్తిస్తాం’ అని రేవంత్ అన్నారు.
For More News..