టార్గెట్ లక్ష ఉద్యోగాలు.. మొదటి దఫా 25 వేల కొలువులు

టార్గెట్ లక్ష ఉద్యోగాలు.. మొదటి దఫా 25 వేల కొలువులు
  • టార్గెట్ లక్ష ఉద్యోగాలు
  • మొదటి దఫా 25 వేల కొలువులు
  • ఫాక్స్ కాన్ ప్రతినిధులతో సీఎం భేటీ
  • మౌలిక వసతులు కల్పిస్తామని హామీ

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. బీఆర్ఎస్ ఓడిపోతే ఫ్యాక్స్ కాన్ వెనక్కు వెళ్లిపోతుందని, ఫ్యాక్స్ కాన్ పరిశ్రమను బెంగళూరుకు తీసుకెళ్లేందుకు కర్నాటక డిప్యూటీ సీఎం ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు లేఖ రాశారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఇవాళ దీటైన సమాధానం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఏకంగా ఫాక్స్ కాన్ ప్రతనిధులను పిలిపించుకొని వారితో సమావేశమయ్యారు. 

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామన్నారు. పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారం అందిస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా  అందిస్తామని పేర్కొన్నారు. 

రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలిపారు. ఫాక్స్ కాన్ యూనిట్ ఏర్పాటు వల్ల లక్ష ఉద్యోగాలు వస్తాయని, తొలి దఫా 25 వేల కొలువులు వస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.