సీఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

V6 Velugu Posted on Jan 21, 2022

సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. మిర్చి రైతులకు ఎకరాకు 50 వేలు.. మిగతా పంటలకు ఎకరానికి 25 వేల చొప్పున  నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయి దాదాపు 8,633 కోట్ల నష్టం వచ్చిందన్న రేవంత్..ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏమి చేశారని ప్రశ్నించారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతామన్నారు రేవంత్ రెడ్డి..

మరిన్ని వార్తల కోసం:

ఈ ఆత్మహత్యలు దొర ప్రేమకు నిదర్శనం

 

యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ప్రియాంక క్లారిటీ

Tagged Revanth wrote a letter to CM KCR on crop damage compensation

Latest Videos

Subscribe Now

More News