యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ప్రియాంక క్లారిటీ

V6 Velugu Posted on Jan 21, 2022

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎలక్షన్లకు నగారా మోగడంతో ప్రచారం, అభ్యర్థుల ఎంపికలో పార్టీలు తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున సీఎం క్యాండిడేట్ ఎవరనే దానిపై ఆ పార్టీ సీనియర్ నేత, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా హింట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేసులో ఎవరున్నారు అని విలేకరులు అడగ్గా.. మీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా అని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి తాను తప్ప ఇంకెవరైనా ఉన్నారా అని అడిగారు. ఇన్నాళ్లూ సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతానన్న ప్రియాంక.. మొత్తానికి తానే యూపీలో కాంగ్రెస్ ముఖచిత్రాన్ని అని బదులిచ్చారు. అన్నిచోట్లా తాను కనిపిస్తున్నా లేదా అని సరదాగా జవాబిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం:

ఈ ఆత్మహత్యలు దొర ప్రేమకు నిదర్శనం

టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ కు కరోనా

Tagged Congress party, Priyanka Gandhi, UP CM, Up elections, Assembly Elections 2022

Latest Videos

Subscribe Now

More News