
రెవెన్యూ శాఖను రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదన్నారు డిప్యూటీ కలెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి. కొత్త విధానాన్ని అమలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. నాంపల్లిలో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో భూ సంబంధిత విషయాల్లో నిపుణులైన సునీల్ కుమార్ తో కలిసి లచ్చిరెడ్డి పాల్గొన్నారు. కన్ క్లూజివ్ టైట్లింగ్, గ్యారంటీ టైటిల్, టైటిల్ ఇన్సూరెన్స్ మూడు విధానాలు అమలైతే రైతుకు, భూ యజమానికి భరోసా కల్గుతుందన్నారు సునీల్ కుమార్. రెవెన్యూ ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకే ఈ సమావేశం జరిపామన్నారు. అన్నిశాఖల్లోనూ అవినీతి ఉందని.. ఇకపై రెవెన్యూ శాఖలో అవినీతి లేకుండా చేస్తామన్నారు.