గోదావరి నీటిని రివర్స్‌‌‌‌‌‌‌‌ పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే బాగుండేది

గోదావరి నీటిని రివర్స్‌‌‌‌‌‌‌‌ పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే బాగుండేది
  •     బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తప్పిదం వల్లే ప్రాజెక్టులు అడుగంటుతున్నయ్‌‌‌‌‌‌‌‌
  •     ఎమ్మెల్సీ, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎంపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

రాయికల్, వెలుగు : మేడిగడ్డ రిపేర్ల కోసం నీటిని గోదావరిలోకి వదిలే బదులు రివర్స్‌‌‌‌‌‌‌‌ పంపింగ్‌‌‌‌‌‌‌‌తో ఎస్సారెస్పీకి మళ్లిస్తే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నిండేదని ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తప్పిదం కారణంగానే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో నీటి నిల్వలు తగ్గిపోయాయని విమర్శించారు. నీటిని నిల్వ చేయకుండా ఇప్పుడు పంటలు ఎండిపోయాయని పొలాల చుట్టూ తిరగడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

 రాయికల్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని శివాజీరెడ్డి ఫంక్షన్‌‌‌‌‌‌‌‌హాల్‌‌‌‌‌‌‌‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. వారికి జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ రైతులతో పాటు, దేశాన్ని కాపాడడం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోనే సాధ్యం అవుతుందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ పదేళ్లలో ఎన్ని ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

బ్లాక్‌‌‌‌‌‌‌‌మనీని తీసుకువచ్చి పేదల అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున వేస్తామన్న మాటలు ఎటుపోయాయని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తే రైతులు సోమరిపోతులు అవుతారంటూ, బడా వ్యాపారస్తులకు లక్షల కోట్లు మాఫీ చేసిన ఘనత మోడీకే దక్కిందన్నారు. జాతీయస్థాయిలో రుణమాఫీ చేయడంతో పాటు, మద్దతు ధర ఇవ్వడం, గల్ఫ్‌‌‌‌‌‌‌‌ సంక్షేమ నిధి ఏర్పాటు, బీడీ కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మ్యాకల అనురాధ రమేశ్‌‌‌‌‌‌‌‌, బ్లాక్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, మండల అధ్యక్షుడు రవీందర్‌‌‌‌‌‌‌‌రావు, యూత్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రధాన కార్యదర్శి కొయ్యేడి మహిపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బాపురం నరసయ్య పాల్గొన్నారు.