కోటగిరి, వెలుగు: పెండింగ్‌లో కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య.. కోటగిరి పోలీస్ స్టేషన్‌లో బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గంజాయి రవాణా చేసేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు , రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెట్టాలన్నారు.
పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సిటీలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డయల్ 112 గురించి ప్రజలకు ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ , సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు , ఇన్‌స్పెక్టర్ ఆర్.అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
