టెన్నిస్ కోర్టులో తారలతో ఫెదరర్

టెన్నిస్ కోర్టులో తారలతో ఫెదరర్

టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈనెల 23 నుంచి 25 వరకు లండన్ లో జరిగే లావర్ కప్ తర్వాత రిటైర్ అవుతానని వెల్లడించాడు. ఆ వెంటనే సోషల్ మీడియా వేదికగా ఫెదరర్ పై నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపించారు. 20సార్లు గ్రాండ్ స్లామ్ గెల్చుకున్న ఘనుడిని కొనియాడారు. ఈ తరుణంలో కొందరు నెటిజన్స్ మన బాలీవుడ్ స్టార్స్ తో ఫెదరర్ టెన్నిస్ ఆడిన ఫోటోలను పోస్ట్ చేశారు. 2014 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ ప్రారంభోత్సవం నాటి  ఆ ఫోటోలనూ మనమూ ఓసారి చూద్దాం..

  • హీరోయిన్ దీపికా పదుకునే మనకు నటిగా సుపరిచితం. కానీ వాళ్ల ఫ్యామిలీకి క్రీడా నేపథ్యం ఉంది. వాళ్ల నాన్న ప్రకాశ్ పదుకునే గొప్ప బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ ప్రారంభోత్సవం సందర్భంగా..ఫెదరర్ తో దీపికా పదుకునే జతకట్టి టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ సరదాగా ఆడారు. అనంతరం దీపికాతో కలిసి ఫెదరర్ డ్యాన్స్ చేశాడు.
  •  

  • ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ ప్రారంభోత్సవంలో ఫెదరర్ ను కలిసిన ప్రముఖుల్లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు. ఈసందర్భంగా ఇద్దరూ టెన్నిస్ బ్యాట్స్ చేతపట్టి సరదాగా గేమ్ ఆడారు. అనంతరం ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకున్నారు.
  •  

  • ఇదే ఈవెంట్ సందర్భంగా టెన్నిస్ కోర్టుపై హీరో అమీర్ ఖాన్ తళుక్కుమన్నారు. తన కొడుకు ఆజాద్ ను ఎత్తుకొని అమీర్ ఖాన్.. ఫెదరర్ తో ఫ్రెండ్లీగా ముచ్చటించారు. కాసేపటి తర్వాత అమీర్ బ్యాట్ పట్టి ఫెదరర్ తో టెన్నిస్ ఆడాడు. 
  •  

  • ఈ కార్యక్రమం సందర్భంగా ఫెదరర్ తో కలిసి గ్రూప్ ఫొటో దిగిన వారిలో అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, దీపికా పదుకునే, సునీల్ గవాస్కర్, సానియా మీర్జా, రితేశ్ దేశ్ ముఖ్, నోవాక్ జకోవిచ్  ఉన్నారు. 

నెంబర్ వన్ ప్రస్థానం..

స్విట్జర్లాండ్ కు చెందిన 41 ఏళ్ల ఫెదరర్ ఖాతాలో 20 గ్రాండ్ స్లామ్స్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 6, ఫ్రెంచ్ ఓపెన్ 1, వింబుల్డన్ 8, యూఎస్ ఓపెన్ 5 టైటిళ్లు ఉన్నాయి. 310 వారాల పాటు టెన్నిస్ లో ప్రపంచ నంబర్ వన్ గా కొనసాగిన ఘనత ఫెదరర్ దే.