యూవీ కిరణాలతో వైరస్​కు చెక్​

యూవీ కిరణాలతో వైరస్​కు చెక్​

హైదరాబాద్, వెలుగు: వైరస్‌‌కు చెక్​ పెట్టే యూవీ ప్రొడక్ట్‌‌లను రీవాక్స్ ఫార్మా లాంచ్ చేసింది. యూవీరోవా బీఆర్(అటానమస్ బెడ్ రోవర్ రోబో), యూవీరోవా ఎస్‌‌టీ(స్టేషనరీ) మెషిన్లను  ప్రవేశపెట్టింది. ఈ ప్రొడక్ట్‌‌లు కరోనా లాంటి వైరస్‌‌లను, బ్యాక్టీరియాలను ఐదు నిమిషాల్లో అంతం చేయగలవని రీవాక్స్ ఫార్మా పేర్కొంది. హాస్పిటల్స్, ఫార్మా కంపెనీలు, జిమ్లు, రెస్టారెంట్లు, ఆఫీసులలో యూవీరోవా ఎంతో ముఖ్యమని రీవాక్స్ ఫార్మా సీఎంఓ గూడుర్ ప్రణయ్ రెడ్డి అన్నారు. ఈ రెండు ప్రొడక్ట్‌‌లను ఇండియాలో తయారు చేశామని, యూవీరోవా బీఆర్ రోబోను కంపెనీ యాప్‌‌ ద్వారా ఫోన్ లేదా టాబ్లెట్‌‌పై ఆపరేట్ చేయొచ్చని కంపెనీ సీఈవో జగన్   పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి ప్రొడక్ట్‌‌ ఇదేనని చెప్పారు. దీన్ని ముఖ్యంగా హాస్పిటల్ ఐసీయూ బెడ్స్, ఇంటెన్సివ్ కేర్‌‌‌‌లలో వైరస్​ను నాశనం చేయడానికి తయారు చేసినట్టు తెలిపారు. ఎస్‌‌టీ మెషిన్లను హాస్పిటల్స్, బిజినెస్ ఫెసిలిటీలు, ఆఫీసుల వంటి ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌లో వాడొచ్చని జగన్ పేర్కొన్నారు.

ప్రపంచ తొలి ట్రిలినియర్ బెజోస్?