మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి  : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి  : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు: అన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ బొల్లికుంటలో రూ.60 లక్షలతో చేపట్టనున్న కూడలి అభివృద్ధి, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలకు ఆయన వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశాదర, చాహత్​బాజ్​పాయ్​లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ మాజీ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.