గోవాకి వెళ్లొచ్చిన కేటీఆర్‌కు ఆందోళన ఎందుకు?

గోవాకి వెళ్లొచ్చిన కేటీఆర్‌కు ఆందోళన ఎందుకు?

ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాను సెమీఫైనల్ మంత్రి మల్లారెడ్డి అల్లుడిపైన గెలిచానని..ఫైనల్  కేసీఆర్ పైనేనన్నారు.కేటీఆర్ ఏమైనా ఇబ్బంది పెడితే.. గజ్వెల్ లో కేసీఆర్ రాజీనామా చేయాలని.. అక్కడే ఇద్దరం తేల్చుకుందామని సవాల్  చేశారు రేవంత్. చంద్రబాబు ఎంగిలి మెతుకులు తిని బతికింది.. కేసీఆర్ కేటీఆర్ అని అన్నారు. చంద్రబాబు లేకుంటే కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు..ఆయన కొడుకుకి పేరు ఎలా పెట్టారని ప్రశ్నించారు. కేటీఆర్ కు ఇష్టం లేకపోతే పేరు మార్చుకుని రకుల్ రావు అని పెట్టుకోవాలని గతంలో  చెప్పానన్నారు రేవంత్. పేరే ఉద్దెర పేరని..ఉద్దెర ప్రసంగాలు ఆపాలన్నారు.

గత నాలుగైదు రోజులుగా కేటీఆర్ ఎందుకో బయటకు రావడం లేదన్నారు రేవంత్. కేటీఆర్ ఈ మధ్యనే గోవా వెళ్లొచ్చిండని.. గోవాకు ఎందుకు వెళ్లొచ్చిండు..ఎందుకు ఆందోళనలో ఉన్నాడు..గోవా ప్రయాణం అధికారికమా?ప్రైవేటా? చెప్పాలన్నారు. కేటీఆర్  సహచరులకు, అత్యంత సన్నిహితులకు ఈడీ నోటీసులిచ్చిందని.. తీగ లాగితే డొంక కదుల్తదన్నారు. ఆనాడు డ్రగ్స్ కేసులో అకున్ సబర్వాల్ చే  విచారణకు ఆదేశించి..కొందరిని విచారణకు  పిలిచి..కొందరిని వదిలిపెట్టారన్నారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్ సన్నిహితులకు సంబంధం ఉందని ఆరోపణలు రావడంతోనే కేసును తొక్కి పెట్టి అకున్ సబర్వాల్ ను బదిలీ చేశారన్నారు.  దీంతో తాను హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పిటిషన్ వేశానన్నారు. డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ,సన్నిహితులకు సంబంధం లేకుంటే..ఈడీ దర్యాప్తుకు ఎందుకు సహకరించడం లేదో చెప్పాలన్నారు.