శివ, రాత్రి పోస్టర్లతో ఆర్జీవీ శివరాత్రి పోస్ట్

శివ, రాత్రి పోస్టర్లతో ఆర్జీవీ శివరాత్రి పోస్ట్

కాంట్రవర్శియల్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా కొత్తగా, వెరైటీగానే చేస్తాడు. ఆయన సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా అదే తరహాలో ఉంటాయి. ఇయ్యాళ మహా శివరాత్రి సందర్భంగా తాజాగా ఆర్జీవీ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. మామూలుగా శివరాత్రి అనగానే ఏ శివాలయం ఫొటోనో, లేదంటే శివుని ఫొటో లేదా వీడియోనో షేర్ చేస్తారు. కానీ ఆర్జీవీ వెరైటీగా ఆలోచిస్తాడు కాబట్టి.. పోస్టు కూడా అలానే పెట్టాడు. తాను తీసిన శివ, రాత్రి సినిమాల పోస్టర్లను పోస్ట్ చేస్తూ హ్యాపీ అనే క్యాప్షన్ ను జోడించాడు. దీంతో నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మహా, హ్యాపీ అనే సినిమాలు కూడా తీయాల్సింది అంటూ రిప్లై ఇస్తున్నారు. ఇలా కూడా విష్ చేస్తారా అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీ క్రియేటివిటీకి హాట్సాఫ్ అంటూ ఇంకొందరు ఫ్యాన్స్ ఆర్జీవీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.