- రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి
నల్గొండ, వెలుగు: ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనను పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం పౌరులకు ఒక వజ్రాయుధంలా పనిచేస్తుందని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సమాచార అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో సరైన సమాచారం ప్రజల వద్ద ఉన్నప్పుడే అది వారికి ఉపయోగపడుతుందని, ఆ సమాచారాన్ని పారదర్శకంగా అందించాల్సిన బాధ్యత పబ్లిక్ అథారిటీలపై ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ తాము ప్రజాసేవకులమని గుర్తించి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ఈ సదస్సులో రాష్ట్ర సమాచార కమిషనర్లు దేశాల భూపాల్, భోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మెహసినా పర్వీన్‌లతో పాటు కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

