వద్దంటే నీ ఇష్టం : పెట్రోల్ కొట్టించుకుంటున్నారు.. 2 వేల నోటు ఇస్తున్నారు..

వద్దంటే నీ ఇష్టం : పెట్రోల్ కొట్టించుకుంటున్నారు.. 2 వేల నోటు ఇస్తున్నారు..

దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకులకు 2 వేల నోట్లు పోటెత్తుతున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే.. ప్రజలు తమ దగ్గర ఉన్న 2 వేల రూపాయల నోట్లను.. పెట్రోల్ బంకుల్లో ఇస్తున్నాయి. తీసుకోం అంటే తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు.. కంప్లయింట్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. పెట్రోల్ కొట్టించుకుంటున్నారు.. 2 వేల నోటు ఇస్తున్నారు.. ఈ తరహాలో ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల్లో చిల్లర కష్టాలు మొదలయ్యాయి.

రూ.2వేల నోట్లను ఉపసంహరించుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన కొన్ని రోజులకే ఇండోర్ లోని పలు పెట్రోల్ పంపుల్లో రూ.2వేల నోట్లతో చెల్లింపులు సాధారణం కంటే ఐదు రెట్టు ఎక్కువయ్యాయి. ఈ నోట్లను బ్యాంకుల్లోనూ సులభంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఇది తమకు అంత ఆందోళన కలిగించే విషయమేం కాదని ఇండోర్ పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర సింగ్ వాసు తెలిపారు. కొంత మంది తమ వాహనాల్లో రూ.100 పెట్రోల్ మాత్రమే పోయించి.. రూ.2వేల కరెన్సీ నోట్లను చెల్లిస్తున్నారన్నారు. ఈ రోజుల్లో చాలా మంది కస్టమర్లు ఆన్ లైన్ లో చెల్లింపులు చేయడం మొదలుపెట్టారు.. కాబట్టి ఇది నోట్లను మార్చుకోవడం సమస్యేం కాదని ఆయన చెప్పారు. తమకు మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో 275 పెట్రోలు పంపులున్నాయని వాసు తెలిపారు.

ఈ పరిస్థితి కేవలం ఇండోర్ లోనే కాదు.. హైదరాబాద్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఔరంగాబాద్, కలకత్తా, గుజరాత్, రాజ్ కోట్ లాంటి నగరాల్లోనూ చోటుచేసుకుంది. అవసరం లేకపోయినా చాలా మంది రూ.2వేల నోట్లతో క్యూ కడుతున్నారు.