
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో చెలరేగిన టీమిండియా యువ బ్యాటర్ రిషబ్ పంత్‌పై ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిషబ్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్ళలో ఒకడని కొనియాడాడు. పంత్ ఆట చూడటం వ్యక్తిగతంగా తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జూలై 2న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా స్టోక్స్ మంగళవారం (జూలై 1) మీడియాతో మాట్లాడుతూ.. ఆట స్వరూపాన్ని మార్చే పంత్ సామర్థ్యాలను, బ్యాటింగ్ పట్ల అతని నిర్భయమైన విధానాన్ని స్టోక్స్ ప్రశంసించాడు.
ALSO READ | Yash Dayal: నాలుగున్నర సంవత్సరాల రిలేషన్.. RCB స్టార్ పేసర్‌పై లైంగిక వేధింపుల కేసు
పంత్ తనకు ప్రత్యర్థి అయినప్పటికీ.. అతడి ఆట చూడటం నాకు ఇష్టమని చెప్పాడు స్టోక్స్. అన్ని ఫార్మాట్లలో పంత్ ఆడే డేరింగ్ డాషింగ్ విధానం తనను ఆకట్టుకుందన్నాడు. పంత్‌కు ఫ్రీ హ్యాండ్ ఇస్తే అతడు ఇంకా అద్భుతంగా ఆడుతాడని.. తొలి టెస్ట్ మాదిరిగా చెలరేగిపోతాడని పేర్కొన్నాడు. ఒకే టెస్ట్ లో రెండు ఇన్సింగ్స్ లో సెంచరీలు సాధించడం గొప్ప విషయమన్నాడు. పంత్ ప్రమాదకరమైన ఆటగాడని కొనియాడాడు.
కాగా, హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో పంత్ దుమ్మురేపాడు. రెండు ఇన్సింగ్స్‌ల్లో అద్భుతమైన సెంచరీలు సాధించాడు. తన అటాకింగ్ స్టైల్‌తో ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేసి ప్రత్యర్థి జట్టు బౌలింగ్ వ్యూహాలను దెబ్బతీశాడు. దీంతో రెండో టెస్ట్ లో పంత్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి టెస్టుల్లో రెండు సెంచరీలతో అలరించిన పంత్.. రెండో టెస్ట్‌లో ఏ విధంగా ఆడతాడో చూడాలి.