
లీడ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేసి సంచలనంగా మారిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ఐసీసీ కొరడా ఝుళిపించింది. మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ మైదానంలో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు ఐసీసీ మందలించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 61వ ఓవర్లో హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ అంపైర్లతో బంతి పరిస్థితి గురించి చర్చించాడు. బాల్ మార్చాల్సిందిగా కోరడంతో అంపైర్లు అందుకు నిరాకరించారు.
"బాల్ గేజ్‌తో బంతిని చెక్ చేసిన తర్వాత అంపైర్లు దానిని మార్చడానికి నిరాకరించినప్పుడు, వికెట్ కీపర్ అంపైర్ల ముందు బంతిని నేలపైకి విసిరి తన అసమ్మతిని చూపించాడు" అని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది. అంపైర్లు బంతిని మార్చకపోవడంతో పంత్ తన అసహనాన్ని వ్యక్తం చేసి బంతిని కోపంగా కింద పడేశాడు. దీంతో అంతర్జాతీయ మ్యాచ్ రూల్ ను పంత్ అతిక్రమించినట్టు తేలింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించినందుకు పంత్‌కు ఒక డీమెరిట్ పాయింట్ లభించింది. లెవల్ 1 ఉల్లంఘనల కారణంగా పంత్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది.
పంత్ పై ఈ ఆరోపణలు చేసి ఆన్-ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, పాల్ రీఫెల్.. థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్.. నాలుగో అంపైర్ మైక్ బర్న్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌కు నివేదించారు. పంత్ తన నేరాన్ని అంగీకరించడంతో క్రమశిక్షణా విచారణ జరగలేదు. ఇక ఈ మ్యాచ్ లో పంత్ రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులు చేసి గిల్ తో భారీ భాగస్వామ్యం నెలకొల్పోయిన ఈ వికెట్ కీపర్.. రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేసి రాహుల్ తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ను నిలబెట్టాడు.
►ALSO READ | ధోనీ అందుకే అందరికీ నచ్చుతాడు : ఫ్రెండ్ కుమార్తె బర్త్ డే పార్టీకి హాజరు
ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే నాలుగో రోజు బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ (247 బాల్స్‌లో 18 ఫోర్లతో 137), రిషబ్ పంత్ (140 బాల్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118) సెంచరీలతో చెలరేగడంతో.. ఇంగ్లండ్ ముందు 371 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు సోమవారం నాలుగో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లలో 21/0 స్కోరు చేసింది. జాక్ క్రాలీ (12 బ్యాటింగ్), బెన్ డకెట్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 90/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 96 ఓవర్లలో 364 రన్స్‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471, ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయ్యాయి.
🚨JUST IN🚨
— Cricbuzz (@cricbuzz) June 24, 2025
Rishabh Pant reprimanded for breaching ICC Code of Conduct.
The incident occurred on Day 3 when Pant threw the ball on the ground after the umpires checked the shape and decided to not change it. pic.twitter.com/zbyg9h7lPp