ధోనీ అందుకే అందరికీ నచ్చుతాడు : ఫ్రెండ్ కుమార్తె బర్త్ డే పార్టీకి హాజరు

ధోనీ అందుకే అందరికీ నచ్చుతాడు : ఫ్రెండ్ కుమార్తె బర్త్ డే పార్టీకి హాజరు

ఎంఎస్ ధోనీ.. మిస్టర్ కూల్.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు.. క్రికెట్ గ్రౌండ్ లో ఎంత టెన్షన్ ఉన్నా.. అతనిలో మాత్రం కూల్ కూల్ ఉంటుంది. అందుకే అంటారు ధోనీని.. మిస్టర్ కూల్. వ్యక్తిగత జీవితం విషయంలోనూ గ్రౌండ్ జీరోగా వ్యవహరిస్తూ ఉంటారు లేటెస్ట్ గా.. రాంచీలోని ఓ ఇంట్లో జరిగిన బర్త్ డే పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేశాడు ధోనీ..

రాంచీలో తన చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. అతని కుమార్తె బర్త్ డే. పార్టీకి ధోనీని ఆహ్వానించాడు ఆ ఫ్రెండ్. ఆహ్వానం వచ్చిన వెంటనే.. ధోనీ ఆ ఇంట్లో బర్త్ డే పార్టీకి అటెండ్ అయ్యాడు. కేక్ కట్ చేస్తున్నప్పుడు వెనకే ఉన్నాడు.. ఆ కుటుంబ సభ్యులతో ఇంట్లో మనిషిలా కలిసిపోయాడు. కట్ కటింగ్ తర్వాత.. ధోనీకి తన ఫ్రెండ్ కేక్ పెడుతుంటే.. ముందు వదినకి తినిపించు.. మీరు ఇక్కడే ఉండేవాళ్లు.. మేమంతా వెళ్లిపోయే వాళ్లం అంటూ జోక్ కూడా చేస్తారు ధోనీ.. తన కామెడీ పంచ్ తో అందర్నీ నవ్వించాడు ధోనీ.

ధోనీ ఎంత సెలబ్రిటీ అయినా.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ విషయాలకు అత్యంత ప్రయార్టీ ఇస్తాడు. తన స్నేహితుల ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కు హాజరవుతూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ లు లేనప్పుడు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లటం.. వాళ్లతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయటం చేస్తుంటాడు ధోనీ.

ప్రస్తుతం ఐపీఎల్ లేదు.. క్రికెట్ మ్యాచులు లేవు.. దీంతో ఇంట్లోనే ఉన్న ధోనీ.. రాంచీలో తన చిన్ననాటి దోస్త్ కుమార్తె బర్త్ డే పార్టీకి అటెండ్ అయ్యి విషెస్ చేసి.. ఆ చిన్నారి గిఫ్టులు కూడా ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ధోనీ వ్యక్తిత్వాన్ని, అంతని నిరాడంబరతను నెటిజన్లు పొగుడుతున్నారు. మిస్టర్ కూల్ అని అందుకే అంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ధోనీ రాకతో ఆ బర్త్ డే పార్టీకే కళ వచ్చింది.. అందరూ భావోద్వేగానికి గురయ్యాడు. చిన్ననాటి స్నేహితుడు అయితే ఆనంద భాష్పాలతో వెక్కివెక్కి ఏడ్చాడు.. ధోనీ వచ్చినందుకు.. ఆనందంతో..