రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌‌‌‌ టీ20: పాక్‌‌‌‌ చేతిలో కుర్రాళ్ల ఓటమి

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌‌‌‌ టీ20: పాక్‌‌‌‌ చేతిలో కుర్రాళ్ల ఓటమి

దోహా: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌‌‌‌ టీ20 టోర్నీలో ఇండియా–ఎ.. దాయాది పాకిస్తాన్‌‌‌‌ షహీన్స్ చేతిలో ఓడింది. ఆదివారం (నవంబర్ 16) జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌‌లో పాక్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత ఇండియా–ఎ19  ఓవర్లలో 136 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. 

ఓపెనర్ సూర్యవంశీ (45), నమన్ దీర్ (35) మెరుపులతో ఓ దశలో 79/1తో మెరుగ్గా నిలిచిన ఇండియా తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. షాహిద్ అజీజ్ 3 వికెట్లతో దెబ్బకొట్టాడు. అనంతరం ఓపెనర్ మాజ్ సదాఖత్ (79 నాటౌట్‌‌) మెరుపులతో పాక్ 13.2 ఓవర్లలోనే  137/2 స్కోరు చేసి గెలిచింది. మంగళవారం ఒమన్‌‌‌‌తో ఇండియా–ఎ పోటీ పడనుంది.