ఏకే47 కేసులో ఆర్జేడీ ఎమ్మెల్యేకు ప‌దేళ్ల జైలుశిక్ష

ఏకే47 కేసులో ఆర్జేడీ ఎమ్మెల్యేకు ప‌దేళ్ల జైలుశిక్ష

ఏకే47 కేసులో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు  కు ప‌దేళ్ల జైలుశిక్ష  పడింది. పాట్నాలోని ఎంపీ -ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఈ శిక్షను ఖ‌రారు చేసింది. అక్రమ‌రీతిలో ఏకే47 గ‌న్ క‌లిగి ఉన్న కేసులో జూన్ 14వ తేదీన ఎమ్మెల్యేను కోర్టు దోషిగా తేల్చింది. అతని ఇంటి నుంచి గ‌న్‌ల‌ను స్వాధీనం చేసుకున్న త‌ర్వాత ఎమ్మెల్యే ప‌రారీ అయ్యారు. ఆ త‌ర్వాత న్యూఢిల్లీలో పోలీసుల‌కు లొంగిపోయారు. 2019 ఆగ‌స్టులో ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంటి నుంచి ఏకే47 గ‌న్‌ను సీజ్ చేశారు. దాంతో పాటు క్యాట్రిడ్జ్‌లు, గ్రేనేడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.  కాగా 'ఛోటే సర్కార్'గా ప్రసిద్ధి చెందిన అనంత్  సింగ్ కామా అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అనంత్  మంచి స్నేహితుడు.  కానీ 2015లోఅసెంబ్లీ ఎన్నికలకు ముందు అనంత్  జేడీయూ నుంచి విడిపోయారు. అ తర్వాత ఆర్జేడీలో చేరారు.