భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సరస్వతి పుష్కరాలకు వెళ్తోన్న కారు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సరస్వతి పుష్కరాలకు వెళ్తోన్న కారు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపూర్ క్రాస్ -కాటారం-మేడిపల్లి ప్రధాన రహదారిపై కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతోన్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను చిట్యాల మండలం నైన్ పాక గ్రామానికి చెందిన విష్ణు, రజితగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దైవ దర్శనం కోసం వెళ్తుండగా ఊహించని విధంగా ప్రమాదంలో తమ వారిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. క్షతగాత్రలు ఆర్తనాదాలతో ఘటన స్థలంలో భీతావాహ వాతావరణం నెలకొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.