మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ మండలం ఇందారం దగ్గర లారీని డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడి మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  వీరంతా కర్నూల్ జిల్లా నుంచి బెల్లంపల్లికి పత్తి ఏరడానికి వస్తున్నట్లు తెలుస్తోంది.