కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దేనపెల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  వరంగల్ నుండి కరీంనగర్ వైపు వస్తున్న కారు (TS 26 C 3851) అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో వరంగల్ కు చెందిన శివ(24) సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమీర్(24) ,సుస్మా(24)కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ కార్తిక్ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ లో  స్థానిక ఆస్పత్రికి తరలించారు.