
శంషాబాద్, వెలుగు: చెల్లికి బిర్యానీ తీసుకురావడానికి వెళ్లిన ఓ అన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషాద ఘటన శంషాబాద్ మండలంలో జరిగింది. శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. మల్కారం గ్రామానికి చెందిన నీరటి అభిలాశ్(19) బుధవారం రాత్రి 9 గంటలకు చెల్లికి బిర్యానీ తీసుకొస్తానని చెప్పి బైక్పై కవేలీగూడకు వెళ్లాడు. బిర్యానీ తీసుకొని తిరిగి వస్తుండగా మల్కారం గ్రామ పరిధిలోని కేబీఆర్ ఫామ్ వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయమై స్పాట్లో చనిపోయాడు. డీసీఎం ఎలాంటి సిగ్నల్ వేయకుండా రోడ్డుపై నిలిపినందునే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.