తెలంగాణ భవన్ ముందు రోడ్డుపై భారీ గుంత : ట్రాఫిక్ జామ్

తెలంగాణ భవన్ ముందు రోడ్డుపై భారీ గుంత : ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12… తెలంగాణ భవన్ ముందు రోడ్డు మధ్యలో పెద్ద గుంత పడింది. పైనుంచి దిగువకు రోడ్డు దిగుతున్న ప్రాంతంలో.. రోడ్డు మధ్యలో రోడ్డు కుంగిపోయి.. గుంత పడింది. దీంతో… వేగంగా వాహనాలు వచ్చే ఏరియా కావడంతో… గుంతలో ఎవరూ పడిపోకుండా పోలీసులు బారికేడ్లు, రాళ్లు పెట్టారు. జీహెచ్ఎంసీ సిబ్బందిని పిలిపించారు. గుంతకు కారణం ఏంటో తెల్సుకుంటున్నారు. దీనిని వెంటనే సరిచేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.  రద్దీగా ఉండే రోడ్డులో గుంత పడటంతో… ట్రాఫిక్  జామ్ అవుతోంది. ఈ దారిలో వచ్చే వారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోకుండా… వేరే దారిలో వెళ్లడం మంచిదని సూచించారు పోలీసులు.