ఖమ్మంలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా

ఖమ్మంలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.  కూసుమంచి మండలం లోక్యతండ సమీపంలోని ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.   ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది ప్రయాణికులు ఉన్నారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులని అంబులెన్స్ లో  ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన పోలీసులు ప్రమాదానికి గల కారణంపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.