- కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి సూచించారు. సడక్ సురక్ష అభియాన్ లో భాగంగా ఈ నెల 31 వరకు నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల పోస్టర్‌ను కలెక్టరేట్‌లో గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా ఇంటికి చేరడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఎక్కువగా టూవీలర్ వాహనదారులే ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం రోడ్డు భద్రతపై అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్టీఏ కమిటీ మెంబర్ సూర్య వర్మ , అధికారులు పాల్గొన్నారు.
ప్రజల భద్రతే ఆర్టీసీ బాధ్యత
మెదక్ టౌన్, వెలుగు: ప్రజల భద్రతే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను నడుపుతోందని మెదక్ అడిషనల్ కలెక్టర్నగేశ్ అన్నారు. గురువారం మెదక్ ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఉంటాయన్నారు. మాసోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఆర్టీసీ డీఎం సురేఖ, పోలీస్, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
