
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: నిర్మాణంలో ఉన్న రహదారుల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అడిషనల్కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ, పరిహారం పంపిణీ త్వరగా పూర్తి చేయాలన్నారు. రోడ్ల విస్తరణకు సంబంధించిన కోర్టు కేసుల వివరాలు తెలుసుకున్నారు. పలు సలహాలు, సూచనలు చేశారు. కీసర ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, ఎస్డీసీఎల్ సూపరింటెండెంట్ మాలతి, ఎన్ హెచ్ఏ పీడీ శ్రీనివాసరావు, మేడ్చల్ తహసీల్దార్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.