రాజస్థాన్లో భారీ వర్షాలు..చెరువులను తలపిస్తున్న రోడ్లు

రాజస్థాన్లో భారీ వర్షాలు..చెరువులను తలపిస్తున్న రోడ్లు

రాజస్థాన్ లో  వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి . గత రాత్రి జోధ్‌పూర్, భిల్వారా, చిత్తోర్‌గఢ్  జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. రోడ్లు, రైల్వే ట్రాక్ లు జలమయం అయ్యాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు.  రోడ్లపై వరదనీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచెత్తడంతో ఇండ్ల  ముందు పార్కింగ్ చేసిన కార్లు, బైక్ లు నీటిలో కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదనీటిలోనే  బైక్ లు మునిగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలెవ్వరూ బయటకు వచ్చేందుకు సాహసించడం లేదు. 

జోధ్పూర్ లో వర్షపు నీటితో నిండిన గోతిలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. వీరిలో ఒక అమ్మాయిని రక్షించారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. స్వల్ప గాయాలతో బయటపడిన చిన్నారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 20 వేలు అందజేశారు. భారీ వర్షాలపై పర్జలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. రాబోయే రెండ్రోజులు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.