ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం..నీట మునిగిన రోడ్లు

ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం..నీట మునిగిన రోడ్లు

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ(గురువారం) ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. ద్వారకాలోని అండర్‌పాస్‌ జలమయం అయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌  ప్రాంతంలో వరద నీరు చేరడంతో.. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీతో పాటు నోయిడా, రోహతక్, జింద్‌, గుర్గాం, ఘజియాబాద్‌, ఫరిదాబాద్‌, ఆగ్రా ప్రాంతాల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.