పెళ్లి చూపులకు వెళ్లొచ్చేసరికి 3 తులాల బంగారం చోరీ

పెళ్లి చూపులకు వెళ్లొచ్చేసరికి 3 తులాల బంగారం చోరీ

గండిపేట, వెలుగు: పెళ్లి చూపుల కోసం ఊరెళ్లి వచ్చేసరికి రాజేంద్రనగర్‌ పీఎస్​పరిధిలోని ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం సిరిమల్లేనగర్‌ కాలనీలో ఉండే తేజేశ్వర్‌రెడ్డి సాఫ్ట్​వేర్​ఇంజనీర్‌. ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన తేజేశ్వర్‌ పెళ్లి చూపుల కోసం ఈ నెల 9న కుటుంబతో కలిసి సొంతూరు వెళ్లాడు. వారం రోజులు అక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి మెయిన్​డోర్ తెరిచి ఉంది. లోనికి వెళ్లి చూడగా అల్మారా, కబోర్డులు అన్ని తెరిచి ఉన్నాయి. అల్మారాలోని వస్తువులన్నీ చిందర వందరగా బెడ్‌పై పడేసి ఉన్నాయి. అందులో దాచిన 3 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి ఆభరణాలు, ల్యాప్‌టాప్, రూ.50 వేలు క్యాష్​కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించిన తేజేశ్వర్​వెంటనే రాజేంద్రనగర్​పీఎస్​లో కంప్లైంట్​చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.