పాలిటిక్స్ కు లాలూ కుమార్తె గుడ్ బై..కుటుంబంతోనూ సంబంధాలు తెంచుకున్నట్లు రోహిణీ ట్వీట్

పాలిటిక్స్ కు లాలూ కుమార్తె గుడ్  బై..కుటుంబంతోనూ సంబంధాలు తెంచుకున్నట్లు రోహిణీ ట్వీట్
  • కుటుంబంతోనూ సంబంధాలు తెంచుకుంటున్నట్టు రోహిణి ప్రకటన

పాట్నా: బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు. కుటుంబం తోనూ తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ లో ఆమె పోస్ట్ పెట్టారు. “నేను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నాను. నా కుటుంబంతోనూ తెగదెంపులు చేసుకుంటున్నాను. 

సంజయ్ యాదవ్‌‌, రమీజ్ అలామ్ ఇచ్చిన సూచనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. అన్ని విమర్శలకు నేను బాధ్యత వహిస్తాను’’ అని పేర్కొన్నారు. రోహిణీ ఆచార్య కొన్నేండ్ల క్రితం తండ్రికి కిడ్నీదానం చేసి వార్తల్లో నిలిచారు. 

2024 లోక్ సభ ఎన్నికల్లో సరన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సోదరుడైన తేజ్ ప్రతాప్​ను తన తండ్రి ఆర్జేడీ నుంచి బహిష్కరించడంతో రోహిణి అసంతృప్తికి లోనయినట్టు తెలుస్తోం ది. అయినప్పటికీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ కోసం ఆమె ప్రచారం నిర్వహించారు.