
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, స్కిప్పర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ ఒకే మ్యాచ్ లో కీలకమైన మైల్ స్టోన్ ను దాటేశారు. 2019 ఏడాదికి గాను.. వన్డే ఫార్మాట్ లో వెయ్యి పరుగులు పూర్తిచేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. వ్యక్తిగత స్కోరు 4 పరుగుల వద్దే రోహిత్ 1000 మార్క్ దాటేశాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ ఖాతాలో 1100 రన్స్ ఉన్నాయి.
స్కిప్పర్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఏడాది 1000 పరుగులు దాటేశాడు. వ్యక్తిగత స్కోరు 7 వద్దే వెయ్యి మార్క్ క్రాస్ చేశాడు. కోహ్లీ ఖాతాలో 1019 రన్స్ ఉన్నాయి. ఇటీవలే అత్యంత వేగంగా అంతర్జాతీయ ఫార్మాట్ లో 20వేల పరుగులు పూర్తిచేసిన ప్లేయర్ గా కోహ్లీ వరల్డ్ రికార్డ్ పూర్తిచేశాడు.
2019 ఏడాది లో 1000 రన్స్ పూర్తిచేసిన లిస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (1138), ఉస్మాన్ ఖవాజా (1067) కూడా ఉన్నారు.