గ్రేట్.. మయాంక్ సెంచరీ కోసం రిస్క్ చేసిన రోహిత్ శర్మ

గ్రేట్.. మయాంక్ సెంచరీ కోసం రిస్క్ చేసిన రోహిత్ శర్మ

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియా పరుగుల దుమ్ములేపుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఇద్దరూ.. చక్కటి సమన్వయంతో.. అద్భుత ఆరంభం అందించారు. టీమిండియా కొన్నేళ్లుగా ఓపెనింగ్ జోడీ సమస్యను ఎదుర్కొంటోంది. ఐతే.. వీరిద్దరి జోడీ.. సంతృప్తికరమైన ఫలితం అందించింది.

మయాంక్ అగర్వాల్ తో తొలి సెంచరీ పూర్తిచేయించడంలో .. సీనియర్ ఆటగాడైన రోహిత్ శర్మ తనదైన సహకారం అందించాడు. ఓ సందర్భంలో తన వికెట్ ను కూడా కోల్పోయేందుకు సిద్ధమై హార్డ్ రన్ కోసం ప్రయత్నించాడు.

మయాంక్ 92, రోహత్ 131 రన్స్ మీద ఉన్నప్పుడు తీసిన ఓ పరుగు ఉత్కంఠ రేపింది. ఆఫ్ సైడ్ బంతిని కొట్టిన మయాంక్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఐతే.. రోహిత్ వద్దని చెప్పినా మయాంక్ పరుగు ఆపలేదు. చేసేదిలేక.. రోహిత్ శర్మ తన వికెట్ పోయినా ఫర్వాలేదని.. అవతలి ఎండ్ వైపు పరుగెత్తాడు. క్రీజువైపు డైవ్ చేశాడు. ఐతే.. అదృష్టవశాత్తూ ఔట్ కాలేదు. ఆ సమయంలో.. రన్స్ కోసం టెన్షన్ పడకు అంటూ మయాంక్ అగర్వాల్ కు రోహిత్ శర్మ సలహా ఇచ్చాడు.

ఒకవేళ రెండో రన్ కోసం రోహిత్ శర్మ వెళ్లకపోయి ఉంటే.. అవతలి ఎండ్ లో ఉన్న మయాంక్ అగర్వాల్ ఔట్ అయి ఉండేవాడు.

మరోసారి.. 99 రన్స్ పై ఉన్నప్పుడు కూడా మయాంక్ రిస్కీ రన్ కోసం ప్రయత్నించాడు. ఐతే.. రోహిత్ శర్మ వారించి పరుగు తీయలేదు. బాల్ మిస్ ఫీల్డ్ అయినప్పటికీ.. రిస్క్ ఎందుకు వద్దని రోహిత్ చెప్పాడు. ఆ తర్వాత థర్డ్ మ్యాన్ దిశగా బాల్ ను కొట్టిన మయాంక్ సెంచరీ పూర్తిచేయడంతో రోహిత్ అభినందించాడు. రోహిత్ ఔటైనా.. ఆ తర్వాత.. డబుల్ సెంచరీ పూర్తిచేసి.. ఆనందాన్ని డబుల్ చేసుకున్నాడు మయాంక్ అగర్వాల్.