
నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముంబై మ్యాచ్ లో బెంగళూరు సూపర్ ఓవర్లో గెలిచింది. ఈ మ్యాచ్ లో 202 పరుగుల టార్గెట్ ను చేధించడంలో ముంబై తడబడింది. అయితే ఇషాంత్ కిషన్ ,పోలార్డ్ కలిసి మ్యాచ్ ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లారు. ఇషాంత్ కీలక ఇన్నింగ్స్ ఇందుకు కారణం. 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99 రన్స్ చేశాడు. అయితే సూపర్ ఓవర్లో బ్యాటింగ్ కు ఇషాంత్ కిషన్ వస్తాడనుకున్నారు. కానీ పోలార్డ్, పాండ్యా వచ్చారు. సూపర్ ఓవర్లో 7 రన్స్ మాత్రమే చేయడంతో ఓటమి పాలైంది.. ఈ విషయంపై మ్యాచ్ తర్వాత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు.
‘అసలు ఈ మ్యాచ్ ను గెలుపు వరకు తీసుకెళ్లడంలో ఇషాంత్ ఇన్నింగ్స్ కీలకం. చాలా అధ్బుతంగా ఆడాడు. కానీ మేము ఓడాం. సూపర్ ఓవర్ కు ముందు ఇషాంత్ కిషన్ చాలా అలిసిపోయి ఉన్నాడు. అందుకే అతన్ని బ్యాటింగ్ కు పంపించలేదు. పాండ్యా భారీ షాట్లు ఆడే పాండ్యాను పంపించాం. సూపర్ ఓవర్లో గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం .కానీ దురదృష్టవశాత్తు రివర్స్ జరిగిందన్నాడు ‘ రోహిత్.