
టీమిండియా స్టార్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ మళ్లీ సెంచరీ కొట్టాడు. ఈ వరల్డ్ కప్ లో నాలుగో సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో 89 బాల్స్ లో 5 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తిచేశాడు రోహిత్.
రోహిత్ శర్మ కెరీర్ లో ఇది 26వ సెంచరీ. ఈ వరల్డ్ కప్ లో ఇది నాలుగోది. ఈ భారీ ఇన్నింగ్స్ తోనే 2019 వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా అవతరించాడు రోహిత్ శర్మ. 516 రన్స్ వద్ద ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను అధిగమించాడు. ఈ వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో 4 సెంచరీలతో 544 రన్స్ చేరాయి. టోర్నీ ముగిసేనాటికి ఈ గణాంకాలు మారనున్నాయి.
92 బాల్స్ లో 104 రన్స్ చేసిన రోహిత్ శర్మ సౌమ్య సర్కార్ బౌలింగ్ లో లిటన్ దాస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ తో కలిసి తొలి వికెట్ కు 180 రన్స్ రికార్డ్ భాగస్వామ్యం అందించాడు.