ప్రపంచం స్తంభించడం చూస్తే బాధేస్తోంది

ప్రపంచం స్తంభించడం చూస్తే బాధేస్తోంది

కరోనాపై కలసి పోరాడుదాం
టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ

న్యూఢిల్లీ: కరోనా రక్కసిపై కలసికట్టుగా పోరాడాలని టీమిండియా స్టార్​ఓపెనర్ రోహిత్ శర్మ పిలుపునిచ్చాడు. కొవిడ్​ దెబ్బతో కొన్ని వారాలుగా
ప్రపంచం మొత్తం స్తంభించిపోవడాన్ని చూస్తుంటే బాధేస్తోందని.. అందరూ కలసికట్టుగా పోరాడితే తిరిగి సాధారణ స్థితి నెలకొంటుందని ట్విటర్ లో
రోహిత్ పేర్కొన్నాడు. అందరూ కొంచెం తెలివిగా, చురుగ్గా ఉంటూ తమ పరిసరాలను గమనిస్తూ ఉండాలన్నాడు.

వ్యాధి లక్షణాలు ఉంటే దగ్గర్లోని వైద్య సిబ్బందిని సంప్రదించాలని చెప్పాడు. పరిస్థితులు సాధారణంగా ఉంటేనే పిల్లలు స్కూళ్లకు వెళ్లే అవకాశం ఉంటుందన్నాడు. కరోనా సోకిన వారిని రక్షించేందుకు తమ ప్రాణాలను లెక్క చేయకుండా శ్రమిస్తున్న డాక్టర్లతోపాటు వైద్య సిబ్బందిని రోహిత్ ప్రశంసించాడు. అలాగే కొవిడ్ సోకడంతో ప్రాణాలు కోల్పోయిన ప్రజలతోపాటు వారి కుటుంబీకులపై బాధను వ్యక్తం చేశాడు.

ఇక, కరోనా వైరస్ గురించి సోషల్‌ మీడియాలో పుకార్లు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలని మరో క్రికెటర్‌ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. అనధికార వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదన్నాడు. అలాగే, ఆరోగ్య సంస్థల సూచనలు, శుభ్రత పాటిం చాలని సూచించాడు.