
న్యూఢిల్లీ: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం అతని వ్యక్తిగత నిర్ణయమని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అన్నారు. ఇందులో బోర్డు పాత్ర లేదని స్పష్టం చేశారు. ‘రిటైర్మెంట్ విషయంలో మేం ఎవర్నీ ఒత్తిడి చేయం. అది మా విధానం కూడా కాదు. ప్లేయర్లకు మేం ఏమి సూచించం. ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది’ అని శుక్లా పేర్కొన్నారు.
టెస్ట్ ఫార్మాట్‌కు రోహిత్ అందించిన సహకారం మరువలేనిదన్నారు. ‘ఈ విషయంలో హిట్‌మ్యాన్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. అతను గొప్ప బ్యాట్స్‌మన్. క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ కావాలని అతను నిర్ణయించుకోకపోవడం చాలా మంచి విషయం. వన్డేలకు రోహిత్ అందుబాటులో ఉంటాడు. కాబట్టి అతని అనుభవాన్ని, నైపుణ్యాన్ని కచ్చితంగా ఉపయోగించుకుంటాం’ అని శుక్లా వెల్లడించారు. ఇక టెస్ట్ కెప్టెన్ ఎవరనేది సెలెక్షన్ కమిటీ నిర్ణయిస్తుందన్నారు.