
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో పరుగుల వరద పారించాడు రోహిత్ శర్మ. ఏకంగా ఐదు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ చేసి తన సత్తా చాటాడు. తద్వారా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కి …ICC ప్రదానం చేసే గోల్డెన్ బ్యాట్‌ను దక్కించుకున్నాడు. ప్రపంచ కప్ టోర్నీలో గోల్డెన్ బ్యాట్ అందుకున్న మూడో ఆటగాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మకు ముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రెండు సార్లు, మిస్టర్ వాల్ రాహుల్ ద్రావిడ్ ఒక సారి గోల్డెన్ బ్యాట్ అందుకున్నారు.
ఈ టోర్నీలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ… ఐదు సెంచరీలతో రికార్డులకెక్కి, మొత్తం 648 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 549 పరుగులతో ఆ తర్వాతి స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 548 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.