రోహిత్ ట్వీట్ : నేను ఔట్ అయ్యానా.. మీరే చెప్పండి

రోహిత్ ట్వీట్ : నేను ఔట్ అయ్యానా.. మీరే చెప్పండి

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ విషయంలో థర్డ్‌ అంపైర్‌ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రోహిత్‌ స్పందించాడు. తాను ఔటైన తీరును ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ ఔట్‌ను జూమ్‌ చేసి మరీ అభిమానులకు తెలియజేశాడు. ఈ క్రమంలోనే తలపట్టుకున్న ఎమోజీని పోస్ట్‌ చేశాడు. ‘ ఇప్పుడు చెప్పండి.. ఇది ఔటా’ అని రోహిత్‌ కోరుతున్నట్లు ఉన్న పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.