వరల్డ్ కప్ : రోహిత్ ఔటా..నాటౌటా..?

వరల్డ్ కప్ : రోహిత్ ఔటా..నాటౌటా..?

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడింది. రోహిత్‌ శర్మ 1 ఫోర్‌, 1 సిక్స్‌తో మంచి టచ్‌లోకి వచ్చిన సమయంలో వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా కీమర్‌ రోచ్‌ వేసిన ఆరో ఓవర్‌ లాస్ట్ బాల్ రోహిత్‌ బ్యాట్‌ కు, ప్యాడ్‌ కు మధ్యలోంచి కీపర్‌ షాయ్‌ హోప్‌ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై విండీస్‌ అప్పీల్‌ కు వెళ్లగా ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. అయితే దీనిపై విండీస్‌ రివ్యూ కోరగా అందులో భారత్‌కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది.  ఇది ఔటా..నాటౌటా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేని క్రమంలో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు.

థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు సైతం తప్పుబడుతున్నారు. ఆ ఔట్‌పై క్లియరెన్స్‌ లేనప్పుడు ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికైనా వదిలేయాలి లేదా బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఇవ్వాలి కదా అని మండిపడుతున్నారు.