రైల్వే ప్రమాదానికి కారణాన్ని గుర్తించాం  : అశ్విని  వైష్ణవ్

రైల్వే ప్రమాదానికి కారణాన్ని గుర్తించాం  : అశ్విని  వైష్ణవ్

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి గల కారణాలను గుర్తించామని రైల్వే మంత్రి అశ్విని  వైష్ణవ్.  ట్రాక్ పునరుద్ధరణ పనులతో పాటుగా సహాయక చర్యలను ఆయన స్వయంగా పరిశీలించారు.  డెడ్ బాడీలను ఆసుపత్రికి తరలించామని తెలిపారు.  

ప్రమాదంతో దెబ్బ తిన్న ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని అశ్విని  వైష్ణవ్ వెల్లడించారు. 2023 జూన్ 7  బుధవారం ఉదయం లోపు ఈ పనులను పూర్తి చేసి ట్రాక్ పై  మళ్లీ  రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక ఈ  దుర్ఘటనకు కవాచ్‌తో సంబంధం లేదని రైల్వే మంత్రి వెల్లడించారు. 

మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  సహాయక చర్యల్లో మూడు NDRF బృందాలు పాల్గొన్నాయి. ప్రమాదంలో గుడ్స్ బోగి ఎక్కిన కోరమండల్ ఇంజన్ ను  భారీ క్రేన్ సహాయంతో కిందికి దించారు.  అందులో కూడా డెడ్ బాడీలు ఉన్నట్టుగా తెలుస్తోంది.  

గ్యాస్ కట్టర్ లతో బోగిలను కత్తిరిస్తూ డెడ్ బాడీలను బయటకు తీస్తున్నారు.  ఇప్పటివరకు  288 మంది చనిపోయినట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘోర రైలు ప్రమాదానికి సిగ్నల్ లోపమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కోరమండల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైలు వెళ్లేందుకు ముందుగా సిగ్నల్ ఇచ్చి, తర్వాత తీసేసినట్లు వెల్లడైంది.