Good Health : గులాబీ పూల ఛాయ్(టీ).. రోజూ తాగితే జుట్టు బాగా పెరుగుతుందా..!

Good Health : గులాబీ పూల ఛాయ్(టీ).. రోజూ తాగితే జుట్టు బాగా పెరుగుతుందా..!

రోజంతా యాక్టివ్ గా, హెల్దీగా ఉండాలంటే ఛాయ్ తాగాల్సిందే అనుకుంటారు చాలామంది. ఛాయ్ లలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో రోజ్ టీ ఒకటి. టేస్టీగా ఉంటే ఈ టీ హెల్త్ కు ఎంతో మంచిది. ఈరోజ్ టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో యాంటీబాడీస్ ను పెంచుతుంది. పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమయ్యే పోషకాలన్నీ రోజ్ ఛాయ్ లో ఉన్నాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. 

ముఖ్యంగా రోజ్ టీ బరువు తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్లు రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. వాటితో పాటు రోజ్ ఛాచ్ ని తాగితే సులువుగా బరువు తగ్గొచ్చని అంటున్నారు డాక్టర్లు. 

ఆరోగ్య ప్రయోజనాలు..

  • ఈ ఛాయ్ ని రోజూ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. 
  • జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 
  • రోజ్ టీ జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది.
  • స్రైస్ బస్టర్ గా పనిచేసి.. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. 
  • శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.
  • నెలసరి నొప్పులు తగ్గిస్తుంది..​​​​​​ 

ALSO READ : ఎంత కేర్ తీసుకున్నా.. జుట్టు పొడిబారుతుందా, చివర్లు చిట్లిపోతున్నాయా..

రోజ్ టీ ఎలా తయారు చేసుకోవాలంటే..

గులాబీ ఛాయ్ ని తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు కింద ఇవ్వబడినవి. 

కావాల్సినవి...

  • ఏడు నుంచి పది గులాబీ రేకులు
  • కప్పు నీళ్లు
  • తేనె
  • నిమ్మరసం

ఇలా తయారు చేసుకోండి..

  • తాజా గులాబీ పూరేకులను తీసుకోవాలి. 
  • వాటిని శుభ్రంగా కడగాలి.
  • ఒక గిన్నెలో నీళ్లు వేడి చేయాలి.
  • ఆ వేడి నీళ్లలో గులాబీ రేకులను వేసి పది నిమిషాలు మరిగించాలి.
  • తర్వాత ఈ నీళ్లని ఒక కప్పులో వడకట్టాలి.
  • అందులో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాలి.